మానవుడు మరణించేవరకు విద్యార్థిగానే వుంటాడు అని సూక్తి::సోమనాథ మహర్షి

సోమనాథ మహర్షి

 *కృషియే దైవం*

                         **************
Srisaila:somamatha maharshi dynamandir::మానవుడు నాకెంతో తెలుసు అనుకుంటాడు.ఈ సృష్టి రహస్యం వంద భాగాలుంటే ఆదినుండి మానవుడు గ్రహించిన విషయాలను లెక్కించి చూస్తే రెండు లేదా మూడు భాగాలు కూడ ఈ ప్రకృతి యొక్క మహిమాన్వితాలను గ్రహించలేదనే భావించాలి.ఇంకా తొంభైఏడు భాగాలు మానవులకు తెలియనివి ఈ సృష్టిలో ఈ ప్రపంచములో మిగిలే వుంటాయి.
ఇంతేకాదు జన్మాంతరం వరకు కూడ ప్రతి మనిషి వాని మెదడులోను మనసులోను శరీరయంత్రములోను గల సర్వమును గూర్చి అయిదు భాగాలు కూడ తెలుసుకోలేడు.వాటి శక్తిని ఉపయోగించుకోలేడు ఎందుకనగా ఈ సృష్టిలోని కార్యములు ఆది అంత్యములు లేకుండ ఎన్నో మహిమలు గల రహస్యాలు వాటి విధులు వున్నాయి.అదే విధంగా మనిషి శరీరం కూడ ఆది అంత్యము లేనట్టి ఒక ప్రపంచమే.కాకపోతే మానవునికి వాని శరీరానికి సంబందించిన క్రియలు కొంతవరకు పరిమితంగా వుంటున్నాయి.కాని శరీరంలో ఇంకా రహస్యంగా జరిగే ప్రకృతి కార్యక్రమాలు అనంతంగా వుంటున్నాయి.అయినను మానవుడు వాన్ని గూర్చి వాడే తెలుసుకోలేడు.వాడిలోని క్రియలు యింకా సుమారుగా 95 – భాగాలు అర్థం గాకుండ వుంటాడు.అందుకే మానవుడు జీవించినంత కాలం విద్యార్థిగానే వుంటాడని అర్థం.

About The Author